కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మహిళలపై నేరాలు 4.4 శాతం తగ్గాయని, ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై శాసన మండలిలో చర్చకు అనిత సమాధానం ఇచ్చారు.
ఫిబ్రవరి 24 మహాప్రభ : కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మహిళలపై నేరాలు 4.4 శాతం తగ్గాయని, ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై శాసన మండలిలో చర్చ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడారు. సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యల వల్లే 20 నెలల్లో రాష్ట్రంలో నేరాలు 6.6 శాతం తగ్గాయని, పోక్సో కేసులు 8 శాతం, మహిళలపై హత్యలు 45శాతం, సామూహిక అత్యాచారాలు 64 శాతం తగ్గాయని తెలిపారు (Home Minister Anitha).గత ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు లేవు కాబట్టే పెట్టుబడులు, పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయని, బయటకు వచ్చిన మహిళ తిరిగి ఇంటికి వెళ్తుందో లేదో తెలియని దుస్థితి ఉండేదని అనిత విమర్శించారు. గత ప్రభుత్వం ప్లాన్ ఆఫ్ ఆక్షన్ ఇవ్వకపోవడం వల్ల రూ. 180 కోట్ల కేంద్ర నిధులు కోల్పోయామని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం కేసులో వైసీపీ గ్రామ సర్పంచ్ అరెస్టయ్యారని అన్నారు (Law and order debate).
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ప్రస్తుత ప్రభుత్వం రాజకీయాల కోసం వాడకోవడం లేదని, అందువల్లే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 25 శాతం తగ్గాయని అనిత పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ నివారణకు ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తున్నామని, ఇప్పటివరకు 96,940 కేజీల గంజాయి సీజ్ చేశామని తెలిపారు. అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబోలేటరీ భవన నిర్మాణాన్ని జగన్ ఆపేశారని, తాము ఫోరెన్సిక్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు (Political news AP).రప్పా.. రప్పా.. నరుకుతాం’ అని శాంతిభద్రతలకు భంగం కలిగిస్తూ రెచ్చగొట్టేలా మాట్లాడితే కేసు ఫైల్ చేశామని, వైసీపీ కార్యకర్తలు అసభ్యంగా మాట్లాడితే దాన్ని జగన్ సమర్థించడం దారుణమని అన్నారు. గీత దాటి రెచ్చ గొడుతూ మాట్లాడినా చూస్తూ ఊరుకునేందుకు ఇక్కడ సీఎంగా ఉన్నది జగన్ కాదని, చంద్రబాబు అని అనిత పేర్కొన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు చేసిన ఆరాచకాల ఫలితంగానే వారు 151 నుంచి 11 సీట్లకు దిగజారారని విమర్శించారు.