ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇంట్లో చోరీ.. భారీగా నగలు, నగదు అపహరణ

ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇంట్లో చోరీకి తెగబడ్డారు దుండగులు. దాదాపు 50 తులాల బంగారం, 10 కిలోల వెండి, లక్ష నగదును దుండగులు అపహరించారు. గుంటూరు, ఫిబ్రవరి 17 మహాప్రభ : పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర (MLA Dhulipalla Narendra) ఇంట్లో చోరీ జరిగింది. గుంటూరు జిల్లాలోని చింతలపూడిలోని నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చొరబడి చోరీకి పాల్పడ్డారు. దాదాపు 50 తులాల బంగారం, 10 కిలోల వెండి నగలు, రూ. లక్ష నగదును దుండగులు అపహరించారు....