mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 6:48 am Digital Edition : Namastey Mahaaprabha

ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో గురువారం ఉదయం భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు మృతిచెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..

ఛత్తీస్‌గఢ్‌ ,ఫిబ్రవరి 26 మహాప్రభ: బీజాపూర్ జిల్లా(Bijapur District)లో ఇవాళ (గురువారం) ఉదయం ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌(Encounter)లో ఇద్దరు మావోలు మృతిచెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధి ఇంద్రావతి నది వెంబడి ఉన్న అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు తెలిసిందని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు.ఈ క్రమంలోనే భద్రతా దళాలు(security forces), మావోయిస్టు(Maoists)లకు చాలా‌సేపటి వరకూ ఎదురు కాల్పులు జరిగినట్లు ఆయన తెలిపారు. కొన్నిగంటలపాటు కొనసాగి, తర్వాత తగ్గాయని.. సంఘటనా స్థలం నుంచి ఇద్దరు యూనిఫాం ధరించిన మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.