ఇసన్నపల్లి గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు
భిక్కనూరు ఏప్రిల్ 30 ( మహాప్రభ ) ఎండలు మండుతున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లా,భిక్కనూరు మండలంలో ఇసన్నపల్లి గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు చల్లని నీరు అందిస్తూ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలు ఎండల వల్ల ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మ్యాకల రాములు,...