ఇలాంటి ప్రతిభ అరుదు.. వైభవ్ సూర్యవంశీపై క్రిస్ శ్రీకాంత్ ప్రశంసలు
టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్.. వైభవ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. అతడిని డెమీ గాడ్‌గా అభివర్ణిస్తూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు కీలక విజ్ఞప్తి చేశాడు. అర్జంట్‌గా వైభవ్‌ను జాతీయ జట్టులోకి తీసుకోవాలని కోరాడు. ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 22 (మహాప్రభ) : భారత క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్‌ను ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ అని పిలుస్తుంటారు. అతడి తర్వాత కొత్త తరం నుంచి మరో సంచలనం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకుని ఔరా అనిపించాడు 15 ఏళ్ల కుర్రాడు వైభవ్...