ఇరాన్-యూఎస్ డీల్‌పై ఆశలు.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు
ఇరాన్-యూఎస్ మధ్య కాల్పుల విరమణ ఉండొచ్చన్న అంచనాల నడుమ సోమవారం స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 6 (మహాప్రభ) : ఇరాన్, యూఎస్ మధ్య రాజీ కుదిరే అవకాశాలు ఉన్నాయన్న వార్తల నడుమ దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. సోమవారం ఉదయం నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నానికి పరిస్థితి తారుమారైంది. కాల్పుల విరమణ ప్రతిపాదనలను ఇరాన్, యూఎస్‌లు పరిశీలిస్తున్నాయన్న వార్తలతో సూచీలు కోలుకున్నాయి. క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్‌ఈ సెన్సెక్స్ 787.30 పాయింట్ల మేర...