mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 12:00 pm Digital Edition : Namastey Mahaaprabha

ఇరాన్-యూఎస్‌ డీల్‌పై ఆశలు.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

ఇరాన్-యూఎస్ మధ్య కాల్పుల విరమణ ఉండొచ్చన్న అంచనాల నడుమ సోమవారం స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి.

ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 6 (మహాప్రభ) : ఇరాన్, యూఎస్ మధ్య రాజీ కుదిరే అవకాశాలు ఉన్నాయన్న వార్తల నడుమ దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. సోమవారం ఉదయం నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నానికి పరిస్థితి తారుమారైంది. కాల్పుల విరమణ ప్రతిపాదనలను ఇరాన్, యూఎస్‌లు పరిశీలిస్తున్నాయన్న వార్తలతో సూచీలు కోలుకున్నాయి.

క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్‌ఈ సెన్సెక్స్ 787.30 పాయింట్ల మేర లాభపడి 74,106.85 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 255.15 పాయింట్ల లాభంతో 22,968.25 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో టైటన్ కంపెనీ, హెచ్‌సీఎల్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా సంస్థల షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. నిఫ్టీలో ట్రెంట్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ టాప్‌లో నిలిచాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 108 డాలర్ల వద్ద కొనసాగుతుండగా ఔన్స్ (31.10 గ్రాములు) మేలిమి బంగారం 4,689 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.