mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 12:02 pm Digital Edition : MAHAA PRABHA DAILY

ఇరాన్ టోల్ ఫీజు వసూలు చేస్తోందా.. హోర్ముజ్‌లో నౌకలు నగదు చెల్లిస్తున్నాయా..

పశ్చిమాసియాలో చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ నియంత్రిస్తున్న సంగతి తెలిసిందే. హోర్ముజ్‌ను ఇరాన్ మూసివేయడంతో పలు దేశాలు ఇంధన సంక్షోభంలో చిక్కుకున్నాయి. అయితే ఈ జలసంధిని భారత్ సహా ఐదు మిత్ర దేశాల కోసం తెరుస్తున్నట్టు తాజాగా ఇరాన్ ప్రకటించింది.

మార్చి 26 (మహాప్రభ) : పశ్చిమాసియాలో చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ నియంత్రిస్తున్న సంగతి తెలిసిందే. హోర్ముజ్‌ను ఇరాన్ మూసివేయడంతో పలు దేశాలు ఇంధన సంక్షోభంలో చిక్కుకున్నాయి. అయితే ఈ జలసంధిని భారత్ సహా ఐదు మిత్ర దేశాల కోసం తెరుస్తున్నట్టు తాజాగా ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరో సంచలన వార్త బయటకు వచ్చింది. హోర్ముజ్ గుండా ప్రయాణించే నౌకల నుంచి ఇరాన్ రివల్యూషనరీ గార్డులు (IRGC) చాలా రోజుల నుంచి అనధికారికంగా టోల్ ఫీజు వసూలు చేస్తున్నారట (Iran Strait of Hormuz toll).
హోర్ముజ్‌లో ఇరాన్ రివల్యూషనరీ గార్డులు అనధికారికంగా టోల్ బూత్ వ్యవస్థను నడపుతున్నారని షిప్పింగ్ న్యూస్ వెబ్‌సైట్ ‘లాయిడ్స్‌లిస్ట్’ పేర్కొంది. మార్చి 13వ తేదీ నుంచి ఆ ఫీజులు వసూలు చేస్తున్నట్టు తెలిపింది. ఐఆర్‌జీసీ నిర్దేశించిన ఫీజు కట్టి ఇప్పటివరకు 26 నౌకలు హోర్ముజ్ దాటినట్టు ‘లాయిడ్స్‌లిస్ట్’ వెల్లడించింది. ఫీజు కట్టిన తర్వాత కూడా ఆ నౌకలు ఎప్పటిలా సాధారణ మార్గంలో ప్రయాణించలేదట. ఇరాన్ అధికారులు అనుమతించిన మార్గంలోనే ప్రయాణించాయట (Hormuz toll booth Iran).పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమైన నాటి నుంచి భారత్‌కు రావాల్సిన ఐదు నౌకలు హోర్ముజ్‌ను దాటాయి (ships transit fees Iran). వాటిల్లో ఇప్పటికే మూడు భారత పోర్టులకు చేరుకున్నాయి. మరో రెండు నౌకలు ఈ వారాంతానికి చేరుకోబోతున్నాయి. అయితే భారత్‌కు చెందిన నౌకలు కూడా ఈ టోల్ ఫీజులు చెల్లించాయా, లేదా అనే విషయంలో క్లారిటీ లేదు.