అమెరికా వాయుసేనకు చెందిన రీఫ్యూయలింగ్ విమానం కేసీ-135 ఏరియల్ ట్యాంకర్ శుక్రవారంనాడు పశ్చిమ ఇరాక్‌లో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని ఆరుగురు సిబ్బందిలో నలుగురు మృతి చెందినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది.
బాగ్దాద్ , మార్చి 13 మహాప్రభ : అమెరికా వాయుసేనకు చెందిన రీఫ్యూయలింగ్ విమానం కేసీ-135 ఏరియల్ ట్యాంకర్ శుక్రవారంనాడు పశ్చిమ ఇరాక్‌లో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని ఆరుగురు సిబ్బందిలో నలుగురు మృతి చెందినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది. రెండు సైనిక ట్యాంకర్ విమానాలు ల్యాండ్ అవుతుండగా ఒక విమానం కూలిపోయిందని, మరొకటి సురక్షితంగా ల్యాండ్ అయిందని తెలిపింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ సందర్భంగా ఫ్రెండ్లీ ఎయిర్ స్పేస్‌లో ఈ ఘటన జరిగినట్టు తెలిపింది. శత్రువుల దాడి వల్లనో, ఫ్రెండ్లీ ఫైర్ వల్లనో విమానం కూలిపోలేదని వెల్లడించింది. అసలు కారణంపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని చెప్పింది.