ఇండోనేషియా సుమత్రా ద్వీపంలో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 6.1గా తీవ్రత
ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైనట్టు యూజీజీఎస్ పేర్కొంది. ఇంటర్నెట్ డెస్క్, మార్చి 3 మహాప్రభ : ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైనట్టు యునైటెడ్ జియోలాజికల్ సర్వే(యూజీజీఎస్) పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సంభవించాయని యూజీజీఎస్ తెలిపింది.అనేక టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ప్రదేశం కారణంగా తరచూ భూకంపాలు ఎదుర్కొనే సుమత్రా ద్వీప సమీపంలోని నీటిలో ఈ భూప్రకంపనలు సంభవించాయి. అయితే దీనివల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు...