mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 7:57 am Digital Edition : Namastey Mahaaprabha

ఇంటర్ పరీక్షలు ప్రారంభం..

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 9:00 గంటలకు ఈ పరీక్షలు మెుదలయ్యాయి.

హైదరాబాద్, ఫిబ్రవరి 25 మహాప్రభ : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 9:00 గంటలకు పరీక్షలు మెుదలయ్యాయి. రెండో సంవత్సరం పరీక్షలు రేపటి నుంచి అంటే.. గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. 33 జిల్లాల్లో విద్యార్థుల కోసం మొత్తం 1,495 పరీక్ష కేంద్రాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మెుదటి, రెండో సంవత్సరం కలిపి మొత్తం 9,97,075 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు.ఇంటర్ మెుదటి సంవత్సరం పరీక్షకు 4,89,126 మంది విద్యార్థులు హజరయ్యారు. రెండో ఏడాది పరీక్షకు 5,07,949 మంది హాజరు కానున్నారు. ఈ పరీక్షలు మార్చి 18వ తేదీ వరకూ జరగనున్నాయి. ఇక పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైన అనుమతిస్తామని ఇప్పటికే ఇంటర్ బోర్డు ప్రకటించిన విషయం విదితమే. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు, గోడ గడియారాలను ఏర్పాటు చేశారు అధికారులు.

పరీక్ష కేంద్రాల వద్ద నిబంధనలు..

  • హాల్ టికెట్: పరీక్షా కేంద్రానికి వెళ్లేటప్పుడు హాల్ టికెట్ కాపీని తీసుకెళ్లడం తప్పనిసరి. ఇది లేనిదే ప్రవేశం ఉండదు.
  • ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా గ్యాడ్జెట్లను పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించరు.