mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 09 February 2026, 8:48 am Digital Edition : Namastey Mahaaprabha

ఆ రెండు పార్టీలకి ఓటేస్తే.. తెలంగాణ మరో బంగ్లాదేశ్: రాజాసింగ్ : Mahaaprabha

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేసినా, ఎంఐఎంకు ఓటు వేసినా తెలంగాణ మరో బంగ్లాదేశ్ అవుతుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి చేస్తున్న ప్రధాని మోదీని చూసి.. బీజేపీకి ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు..

హైదరాబాద్, ఫిబ్రవరి 9,మహాప్రభ : సీఎం రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) సెటైర్లు గుప్పించారు. ఓవైసీకి రేవంత్‌రెడ్డి దాసోహం అంటున్నారని విమర్శలు చేశారు. సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అసదుద్దీన్ , అక్బరుద్దీన్‌లకు రేవంత్‌రెడ్డి సరెండర్ అయ్యారని ఎద్దేవా చేశారు. మునిసిపల్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీని చూసి బీజేపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేసినా.. ఎంఐఎంకు ఓటు వేసినా తెలంగాణ మరో బంగ్లాదేశ్ అవుతుందన్నారు. దేశాన్ని అభివృద్ధి చేస్తున్న ప్రధాని మోదీని చూసి బీజేపీకి ఓటేయాలని రాజాసింగ్ సూచించారు.