mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 12:06 pm Digital Edition : Namastey Mahaaprabha

ఆ జిల్లాలకు బిగ్ అలర్ట్.. పిడుగులతో భారీ వర్షం

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ శుక్రవారం వెల్లడించింది. రాగల మూడు గంటల్లో అల్లూరి, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

అమరావతి ఏప్రిల్ 2 (మహాప్రభ) : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ శుక్రవారం వెల్లడించింది. రాగల మూడు గంటల్లో అల్లూరి, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మన్యం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

40-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చెట్ల కింద నిలబడవద్దని ప్రజలకు స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఒక ప్రకటన విడుదల చేశారు.