ఆస్పత్రిలో సోనియా గాంధీ.. హెల్త్ బులిటిన్ విడుదల

సోనియా ఆరోగ్యానికి సంబంధించి గంగారాం ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ విజయ్ స్వరూప్ గురువారం హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. సోనియా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. న్యూఢిల్లీ, మార్చి 26 (మహాప్రభ) : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మార్చి 24వ తేదీ రాత్రి 10.22 గంటల ప్రాంతంలో జ్వరం కారణంగా ఆమె న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు....