mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 12:08 pm Digital Edition : MAHAA PRABHA DAILY

ఆస్పత్రిలో సోనియా గాంధీ.. హెల్త్ బులిటిన్ విడుదల

సోనియా ఆరోగ్యానికి సంబంధించి గంగారాం ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ విజయ్ స్వరూప్ గురువారం హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. సోనియా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు.

న్యూఢిల్లీ, మార్చి 26 (మహాప్రభ) : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మార్చి 24వ తేదీ రాత్రి 10.22 గంటల ప్రాంతంలో జ్వరం కారణంగా ఆమె న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోనియా ఆరోగ్యానికి సంబంధించి గంగారాం ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ విజయ్ స్వరూప్ గురువారం హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. సోనియా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు.చికిత్సకు సోనియా ఆరోగ్యం సహకరిస్తోందని వెల్లడించారు. ఆమెకు సీనియర్ డాక్టర్ల బృందం చికిత్స అందిస్తోందని, ఇంకా పర్యవేక్షణ అవసరం ఉందని తెలిపారు. కాగా, డాక్టర్లు సిస్టమేటిక్ ఇన్‌ఫెక్షన్‌ను నయం చేయడానికి సోనియాకు యాంటీ బయాటిక్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మరికొన్ని రోజులు ఆమెను ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందించే అవకాశం ఉంది.