ఆవును చంపిన పెద్ద పులి.. పోలవరం ప్రాంతంలో భయాందోళన
ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. పాత చేగొండపల్లి గ్రామం వద్ద ఆవుపై పులి దాడి చేసి చంపేసింది. ఏలూరు జిల్లా ఏప్రిల్ 18 (మహాప్రభ) : పోలవరం ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ప్రాజెక్ట్ సమీపంలోని పాత చేగొండపల్లి గ్రామం వద్ద ఒక ఆవుపై పులి దాడి చేసి చంపిన ఘటన స్థానికంగా భయాందోళనకు దారితీసింది. ఆవు మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు....