ఆదివాసీల అస్తిత్వ పతాక ‘మేడారం’ – Festival Sammakka Saralamma

మారుమూలన ఉన్న ఓ వనారణ్యం రెండేళ్లకోసారి జనారణ్యమై భాసిల్లడానికి జాతరలోని విభిన్నతే కారణం. స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో ఈ జాతర నాలుగు రోజుల పాటు సాగుతుంది. ఆదివాసీల అరుదైన పూజా విధానాలతో, తీరొక్క మొక్కులతో అబ్బురపరుస్తుంది. మహాప్రభ - వెబ్ డెస్క్ : మేడారం జాతరను ఎన్నిసార్లు చూసినా, అక్కడి ఆదివాసీ సంప్రదాయాలతో ఎన్నిసార్లు సహానుభూతి చెందినా తనివి తీరదు. ప్రతీసారి ఏదో ఒక విభిన్నత అనుభవంలోకి వచ్చి భావోద్వేగాన్ని కలిగిస్తుంది. తెలంగాణ నేల స్వభావానికి, సాంస్కృతిక వైభవ పరంపరకు మేడారం నిలువెత్తు ప్రతీక....