mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 11:05 am Digital Edition : MAHAA PRABHA DAILY

ఆటో డ్రైవర్ అని తేలిగ్గా చూడకండి.. ఇతడు ఒక్క రోజులో ఎంత సంపాదిస్తాడో తెలిస్తే..

మనదేశంలో ప్రభుత్వ ఉద్యోగులు లేదా సాఫ్ట్‌వేర్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో పని చేస్తున్న వారే భారీగా సంపాదిస్తారని అనుకుంటుంటాం. అయితే రోడ్ల పక్కన ఫుడ్‌స్టాల్స్ నడిపే వారు, టీ అమ్మేవారు, ఆటో నడుపుకునే వారు కూడా ఈ రోజుల్లో భారీగానే సంపాదిస్తున్నారు.

మార్చి 16 మహాప్రభ : మనదేశంలో ప్రభుత్వ ఉద్యోగులు లేదా సాఫ్ట్‌వేర్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో పని చేస్తున్న వారే భారీగా సంపాదిస్తారని అనుకుంటుంటాం. అయితే రోడ్ల పక్కన ఫుడ్‌స్టాల్స్ నడిపే వారు, టీ అమ్మేవారు, ఆటో నడుపుకునే వారు కూడా ఈ రోజుల్లో భారీగానే సంపాదిస్తున్నారు. తాజాగా ముంబైకి చెందిన ఓ ఆటో డ్రైవర్ రోజువారీ సంపాదన గురించి విని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అతడిని ఇంటర్వ్యూ చేసిన వ్లాగర్ కూడా షాకయ్యాడు (Auto driver daily income).

@uvichar_ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ముంబైలో ఆటో నడుపుకునే ఓ వ్యక్తి, తాను రోజుకు రూ.2500 సంపాదిస్తున్నానని చెప్పి షాకిచ్చాడు. అది కూడా డీజిల్ ఖర్చులు పోగా అతడికి రోజుకు రూ.2500 మిగులుతోందట. అంటే నెలకు దాదాపు రూ.75 వేలు. అతడి సంపాదన విని ఆ వ్లాగర్ ఆశ్చర్యపోయాడు. బీటెక్ చేసి ఓ పెద్ద సంస్థలో ఉద్యోగం చేసినపుడు కూడా తాను అంత సంపాదించలేదని ఆ వ్లాగర్ చెప్పాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (Auto driver ₹2500 per day).ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు పది లక్షల మందికి పైగా వీక్షించారు (Auto driver earnings video). 60 వేల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ‘భారతదేశంలో, రూ. 30,000 ఉద్యోగాన్ని గౌరవప్రదంగా పరిగణిస్తారు. కానీ రూ. 75,000 సంపాదించే ఆటో డ్రైవర్ ఉద్యోగాన్ని కాదు. ఇది విజయానికి వింతైన నిర్వచనం’ అని కామెంట్ చేశారు. చాలా మహానగరాల్లోని ఆటో డ్రైవర్లు భారీగా సంపాదిస్తుంటారని కొందరు కామెంట్లు చేశారు.