అసెంబ్లీలో మైనింగ్ అంశంపై వాడివేడి చర్చ… హరీశ్ రావు సంచలన ఆరోపణలు

మైనింగ్ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌పై ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. మైనింగ్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని హరీశ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్, మార్చి 28 (మహాప్రభ) : తెలంగాణ అసెంబ్లీలో మైనింగ్ అంశంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘కంచె చేను మేసినట్లు... రక్షకుడే భక్షకుడిలా మారినట్లు అక్రమ మైనింగ్ జరుగుతోంది’ అని విమర్శించారు. నగరం నడిబొడ్డున అక్రమ మైనింగ్ జరుగుతోందని.. రాఘవ కన్స్ట్రక్షన్స్...