mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 12:56 pm Digital Edition : Namastey Mahaaprabha

అషురెడ్డి కేసులో షాకింగ్ ట్విస్ట్.. సూసైడ్ బెదిరింపుల ఆరోపణలు

ప్రముఖ సినీనటి, బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి కేసులో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. బాధితుడిగా చెప్పుకొంటున్న ధర్మేంద్ర ఇచ్చిన వివరాల ప్రకారం.. ఈ వ్యవహారం ప్రేమ, డబ్బు లావాదేవీలు, బెదిరింపుల వంటి అంశాల చుట్టూ తిరుగుతోంది.

హైదరాబాద్ ఏప్రిల్ 27 (మహాప్రభ) : ప్రముఖ సినీనటి, బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి (Actress Ashu Reddy) కేసులో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. బాధితుడిగా చెప్పుకొంటున్న ధర్మేంద్ర ఇచ్చిన వివరాల ప్రకారం.. ఈ వ్యవహారం ప్రేమ, డబ్బు లావాదేవీలు, బెదిరింపుల వంటి అంశాల చుట్టూ తిరుగుతోంది. తనపై కేసు పెడితే ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు ధర్మేంద్రను గతంలో బెదిరించినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు కూడా బాధితుడు పేర్కొన్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన ప్రతిసారీ.. సూసైడ్ చేసుకుంటానని హెచ్చరించిందని అన్నారు. అషురెడ్డి గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్లు చెప్పారు.

ఆర్థిక కోణం..

ఈ కేసులో డబ్బు లావాదేవీలు కీలకంగా మారాయి. ఇండియాలోనే కాకుండా యుకేలో కూడా లోన్లు తీసుకున్నట్లు తెలిపారు. ఆ డబ్బును అషురెడ్డి కోసం ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. అప్పులు పెరగడంతో వాటిని తిరిగి అడగటం ప్రారంభించానని చెప్పారు. అయితే, డబ్బు అడిగిన ప్రతిసారీ.. ఆమె ఆత్మహత్య బెదిరింపులకు దిగిందని ఆరోపించారు.

పోలీసుల చర్యలు..

ఈ ఘటనపై రెండు నెలల క్రితమే ధర్మేంద్ర కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారం రోజుల క్రితం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ముఖ్యంగా డబ్బు లావాదేవీల్లో నిజానిజాలు, బెదిరింపుల ఆరోపణలు, ఇద్దరి మధ్య ఉన్న సంబంధాల అంశాలను పరిశీలిస్తున్నారు. పోలీసుల దర్యాప్తు అనంతరం ఈ కేసులో అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది.