అమరావతిపై భ్రమలు వద్దు.. స్పష్టత తెచ్చుకోండి..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న 'అమరావతి' రాజధాని అంశంపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రజలు భయాందోళనలతో కాకుండా.. వివేకంతో ఆలోచించాలని ఆయన సూచించారు.. ఏప్రిల్ 6 (మహాప్రభ) : ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు ఇటీవల పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో అధికార బిల్లుకు సహకరించిన అన్ని పార్టీలకూ.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అయితే, రాజధాని అమరావతి విషయంలో ప్రతిపక్ష...