అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత
అమరావతిని అంగుళం కూడా వేరొకరు కదిపే పరిస్థితి లేకుండా కట్టుదిట్టంగా చట్టాలు, శాసనాలతో ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం సొంతమని హోం మంత్రి అనిత అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా అమరావతిని పునఃప్రతిష్టించిన కేంద్ర ప్రభుత్వానికి హోం మంత్రి ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నం ఏప్రిల్ 1 (మహాప్రభ) : అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి(PM Narendra Modi) హోంమంత్రి అనిత(Home Minister Anithas) ధన్యవాదాలు తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వల్లే ఇదంతా...