అన్ని జోన్లలో పర్యటిస్తా.. రోడ్లు శుభ్రంగా లేకపోతే సస్పెండ్ చేస్తా .. సీఎం రేవంత్ వార్నింగ్
మున్సిపల్ అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. త్వరలోనే ప్రతి జోన్‌లో పర్యటిస్తానని.. రోడ్డు శుభ్రంగా లేకపోతే అధికారులను అక్కడికక్కడే సస్పెండ్ చేస్తానని సీఎం హెచ్చరించారు.. హైదరాబాద్, ఫిబ్రవరి 17 మహాప్రభ: పురపాలక శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈరోజు (మంగళవారం) కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, కమిషనర్లు, సిబ్బందిపై సీఎం సీరియస్ అయ్యారు. త్వరలోనే ప్రతి జోన్‌లో వ్యక్తిగతంగా పర్యటించి పరిస్థితులను పరిశీలిస్తానని స్పష్టం చేశారు. రోడ్లు శుభ్రంగా లేకపోతే అక్కడికక్కడే అధికారులపై చర్యలు...