mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 20 February 2026, 6:28 am Digital Edition : Namastey Mahaaprabha

అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ క్రికెటర్ గుడ్‌ బై

కెనడా క్రికెట్ చరిత్రలోనే విజయవంతమైన ఆటగాడు, ఆ జట్టు మాజీ కెప్టెన్ నవనీత్ ధలివాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గురువారం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా అఫ్గానిస్థాన్‌తో జట్టుతో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్ అనంతరం తన 11 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు.

ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 20 మహాప్రభ: టీ20 ప్రపంచ కప్ 2026లో మరో మ్యాచ్‌తో గ్రూప్ స్టేజ్ ముగియనుంది. దీంతో అనేక జట్ల ప్రయాణం ముగిసింది. ఎనిమిది జట్లు ఇప్పటికే సూపర్ 8 దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో కెనడా క్రికెట్ చరిత్రలోనే విజయవంతమైన ఆటగాడు, ఆ జట్టు మాజీ కెప్టెన్ నవనీత్ ధలివాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గురువారం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా అఫ్గానిస్థాన్‌తో జట్టుతో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్ అనంతరం తన 11 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు.37 ఏళ్ల నవనీత్ ధలివాల్ కెనడా తరఫున టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లోఅత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఆయన కెరీర్‌లో 48 టీ20 మ్యాచ్‌లు ఆడి 1305 పరుగులు సాధించాడు. బ్యాటర్‌గానే కాకుండా కెప్టెన్‌గానూ జట్టును సమర్థవంతంగా నడిపించాడు. ఆయన నాయకత్వంలో కెనడా జట్టు.. 29 టీ20ల్లో 21 విజయాలను అందుకోవడం విశేషం.

కోచ్‌గా సరికొత్త ఇన్నింగ్స్..

మైదానాన్ని వీడినా.. క్రికెట్‌ను వీడనని నవనీత్ తెలిపాడు. కెనడాలో అట్టడుగు స్థాయిలో ఉన్న యువ క్రికెటర్లను తీర్చిదిద్దేందుకు కోచింగ్ వైపు వెళ్లనున్నట్టు ప్రకటించాడు. 19 ఏళ్ల యువ ఆటగాడు యువరాజ్ సమ్రా.. న్యూజిలాండ్‌పై సెంచరీ బాదడం చూస్తుంటే కెనడా క్రికెట్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉందని తాను నమ్ముతున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా ఈ టోర్నీలో కెనడా గ్రూప్ స్టేజిలోనే నిష్క్రమించిన విషయం తెలిసిం