mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 11:17 am Digital Edition : Namastey Mahaaprabha

అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో వైభవ్ అరుదైన రికార్డ్ : Mahaaprabha

అండర్-19 ప్రపంచ కప్-2026లో భారత యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

స్పోర్ట్స్ డెస్క్ ఫిబ్రవరి6 మహాప్రభ : ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్-2026లో భారత యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మెగా టోర్నమెంట్లో ఇప్పటివరకు ఏ ఆటగాడికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు వైభవ్. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఐపీఎల్, యూత్‌ వన్డేల్లో అతిపిన్న వయసులోనే అత్యంత వేగవంతమైన సెంచరీలు నమోదు చేసిన వైభవ్‌.. ప్రస్తుతం అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీలో బిజీగా ఉన్నాడు. శుక్రవారం టైటిల్‌ పోరులో ఇంగ్లాండ్‌తో తలపడుతున్న ఆయుశ్‌ మాత్రే బృందం.. హరారే వేదికగా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లలో ఆరోన్‌ జార్జ్‌ 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. 14 ఏళ్ల సూర్యవంశీ కాసేపు ఇంగ్లీష్ బౌలర్లపై దయచూపి.. ఆ తర్వాత దండయాత్ర చేశాడు. అది మాములు దండయాత్ర కాదు.. దయాగాడి దండయాత్ర అన్నట్లు సాగింది అతడి బ్యాటింగ్. ఫలితంగా తొలి 32 బంతుల్లో అర్ధ శతకం, 55 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడీ చిచ్చర పిడుగు. ఆ తర్వాత టాప్ గేర్‌లోకి వెళ్లి.. సునామీ సృష్టించాడు.ఈ క్రమంలో 71 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేశాడు వైభవ్. ఒకానొద దశలో డబుల్ సెంచరీ చేస్తాడని అంతా భావించారు. కానీ 80 బంతుల్లో 175 పరుగులు చేసి.. మానీ లమ్స్ డెన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ థామస్ రెవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఇంగ్లీష్ బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. వైభవ్ క్రీజులో ఉన్నంతసేపు.. ఇంగ్లాండ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు.ఈ క్రమంలో 71 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేశాడు వైభవ్. ఒకానొద దశలో డబుల్ సెంచరీ చేస్తాడని అంతా భావించారు. కానీ 80 బంతుల్లో 175 పరుగులు చేసి.. మానీ లమ్స్ డెన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ థామస్ రెవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఇంగ్లీష్ బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. వైభవ్ క్రీజులో ఉన్నంతసేపు.. ఇంగ్లాండ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు.

అండర్‌-19 వరల్డ్ కప్‌‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు

  • వైభవ్‌ సూర్యవంశీ – 33 (2026)
  • డెవాల్డ్‌ బ్రెవిస్‌ – 18 (2022)
  • ఫిన్‌ అలెన్‌ – 18 (2016, 2018)
  • జాక్‌ బర్న్‌హామ్‌ – 15 (2016)
  • మైకేల్‌ హిల్‌ – 14 (2008)
  • నికోలస్‌ పూరన్‌ – 14 (2014)

అండర్-19 ప్రపంచ కప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు..

  • 15 – వైభవ్ సూర్యవంశీ (భారత్) Vs ఇంగ్లాండ్-2026
  • 12 – మైఖేల్ హిల్ (ఆస్ట్రేలియా) Vs నమీబియా-2008
  • 11 – క్రెయిగ్ సిమ్మన్స్ (ఆస్ట్రేలియా) Vs కెన్యా- 2002

వైభవ్ సూర్యవంశీ గతంలో తన పేరిట(14 సిక్సర్లు) ఉన్న ఈ రికార్డును తాజాగా తనే బ్రేక్ చేశాడు. ఇదే టోర్నీలో దుబాయ్‌లో యూఏఈ జట్టుపై 14 సిక్సర్ల బాదాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తుదిపోరులో 15 సిక్సర్లు కొట్టాడు